బాలీవుడ్ నటి కంగన ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఆమె గురించి చర్చనీయంశంగా మారింది. బాలీవుడ్ నటి కంగన రనౌత్ బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సినీగేయ రచయిత జావెద్ అక్తర్ తనపై వేసిన పరువునష్టం కేసులో విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ తో పాటు క్రాస్ కేసులను కూడా వీటితో కలపాలని కోరుతూ కంగన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించడం జరిగింది.
సినీగేయ రచయిత జావెద్ అక్తర్ తనపై వేసిన పరువునష్టం కేసులో విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌తోపాటు క్రాస్ కేసులను కూడా వీటితో కలపాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. హృతిక్‌తో అఫైర్ విషయంలో గొడవ తర్వాత అక్తర్ తనను ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ నేరపూరితంగా బెదిరించాడంటూ ఓ ఇంటర్వ్యూలో కంగన ఆరోపించారు.