కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా D51 అనే పేరును పెట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ డ్రామాకి 'ధారవి' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రాజకీయాల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున నెగెటివ్ షేడ్స్‌తో కనిపిస్తారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.