సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో తమ మూడవ ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ కోసం ప్రొడక్షన్ హౌస్ మొదట శేఖర్ కమ్ములతో కలిసి పనిచేసింది. కరోనా దృష్ట్యా 50% సీటింగ్ పరిమితి ఉన్నప్పటికీ నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.
లవ్ స్టోరీ విజయం తర్వాత శేఖర్ కమ్ముల మరోసారి SVCCతో తాత్కాలికంగా DNS అనే ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ మూడవసారి సహకారం గురించి అధికారకంగా ప్రకటించారు. నటీనటులు మరియు సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.