తన కథను విని కొన్నేళ్ల తర్వాత సినిమా తీసి కాపీరైట్ చట్టాన్ని బేబీ సినిమా దర్శకుడు, నిర్మాతలు ఉల్లంఘించారని వారిపై చర్యలు తీసుకోవాలని లఘుచిత్రాల దర్శకుడు శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ’’2015లో ‘కన్నా ప్లీజ్’ టైటిల్‌తో రాసుకున్న కథకు తరువాత ‘ప్రేమించొద్దు’ అని టైటిల్ పెట్టారు. ఈ కథ, బేబీ సినిమా కథ ఒక్కటే‘‘ అని శిరిన్ శ్రీరామ్ తెలిపారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.