హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘‘నేను పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో కొందరు నా శరీరాకృతిపై కామెంట్స్ చేశారు. గ్లామర్ రోల్స్‌కు పనికిరానన్నారు. ఓ సినిమా ఆడిషన్స్‌లో ఫొటోగ్రాఫర్ నన్ను చూసి ‘ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు?’ అన్నాడు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదుర్కొన్నాను’’ అని మృణాల్ చెప్పారు.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. తాను బాలీవుడ్ చిత్రాల్లో నటించే రోజుల్లో బాడీ షేమింగ్‌కు గురైనట్లు తెలిపారు. గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు 'మీరు అస్సలు సెక్సీగా లేరు' అని కామెంట్ చేశారని వెల్లడించారు.