మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత.. దీని నుంచి బయటపడేందుకు ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుట పడినట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. త్వరలోనే షూటింగ్స్‌లలో పాల్గొంటానని తెలిపింది.
తన చుట్టూ ఉన్నవారిని చూసి స్ఫూర్తి పొందుతానని, కొత్త సంవత్సరం కూడా పండగ సందర్భంగా రిలాక్సింగ్ గా సాగిపోవాలంది. ఈ సంవత్సరం తాను ఆరోగ్యంపై ఫోకస్ చేస్తానని, మళ్లీ వర్క్ లోకి వెళతానని, కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకుంటానని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. సమంత తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టబోతోందని అందరికీ అర్థమైంది. ఇది తెలుసుకున్న సామ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa