ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తాండల్‌' లో థండరింగ్ ట్విస్ట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 04:53 PM

కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవల 'తాండల్' బృందం ది ఎసెన్స్ ఆఫ్ తాండల్ అనే టైటిల్‌తో ఒక గ్లింప్సె ని విడుదల చేసింది. ఇది చిత్రం యొక్క ప్రధాన కథను వెల్లడించింది. 126-సెకన్ల క్లిప్ లో దేశభక్తి కోణంతో పాటు అండర్ కరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఈ సినిమాకి స్యాడ్ ఎండింగ్ ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చై మత్స్యకారునిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa