మార్చి 2023లో యూనివర్సల్ స్టార్ హీరో కమల హస్సన్ ప్రముఖ నటుడు STR యొక్క తదుపరి చిత్రాన్ని తానే సమర్పిస్తానని కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు. తాత్కాలికంగా STR 48 అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు. దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని RKFI మరియు టర్మెరిక్ మీడియా నిర్మిస్తోంది.