ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవా షెడ్యూల్ ని ముగించిన 'DNS' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 10:11 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా D51 అనే పేరును పెట్టారు. ఈ యాక్షన్ డ్రామాకి 'ధారవి' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కనిపించనున్నట్లు సమచారం.


ముంబయిలోని ధారవిలో మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, గోవాలో జరిగిన ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని మూవీ మేకర్స్ పూర్తి చేసినట్లు సమచారం. ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.


నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com