వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మిస్టరీ థ్రిల్లర్ కి 'ఊరి పేరు భైరవకోన' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ మూవీ ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ ట్విస్ట్ ప్రేక్షకుల మనసులను దోచేస్తుందని అన్నారు. ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ను ఎవరూ ఊహించలేరని, ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. అనేక కారణాల వల్ల షూట్ ఆలస్యమైందని వాటిలో ఒకటి తమిళ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు కావ్య థాపర్ గాయపడిందని నిర్మాత తెలిపారు.
ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.