వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి మూవీ మేకర్స్ దాదాపు 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.
ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్టైన్మెంట్కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.