ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్ వంటి సినిమాల్లో నటించింది తాజాగా రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తెలుగుచిత్ర పరిశ్రమ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను చాలా కష్టపడ్డ పరిశ్రమ టాలివుడ్, ఆ పరిశ్రమ చాలా పురుషాధిక్య పరిశ్రమ, ఇది భరించలేనిదని, మహిళలను చూసే విధానం బాగోదని అభిప్రాయ పడింది. నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను.. దాన్ని ముగించాను. అది నా కోసమేనని అప్పుడు అర్థమైంది!'' అని ఆప్టే వ్యాఖ్యానించారు. అంటూ సోషల్ మీడియాలో టాలీవుడ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం రాజీవ్ మసంద్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే ఈ విషయాల గురించి మాట్లాడింది. వాటిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే మళ్లీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ క్లిప్‌ని షేర్ చేయడానికి కారణం ఏమిటి? అని కొందరు అడుగుతున్నారు. ఎన్నో రొమాంటిక్ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే తెలుగు ఇండస్ట్రీ గురించి చెబుతూ? కొంతమంది షాక్ అయ్యారు. రాధిక విలువలు లేకుండా నటించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెను తిట్టడం కూడా కనిపిస్తుంది.