నటి హనీ రోజ్ నటించిన రాణి ది రియల్ స్టోరీ మలయాళ చిత్రం విడుదలై ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయింది. మార్చి 7 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు. అయితే మరోసారి మలయాళ ప్రేక్షకుల అలరించడానికి హనీ రోజ్ ఓటీటీలో కనించనుంది.
OTTలను ప్రవేశపెట్టిన తర్వాత, వినోద రంగంలో పెను మార్పులు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేమికులు తమకు నచ్చిన సినిమాలను వీక్షిస్తున్నారు. ఆ సినిమాలు ఏ భాషలో తీసినా ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తారు.ఈ మధ్య మాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఇతర భాషల్లోకి డబ్ అవుతున్నాయి. తాజాగా, మరో మాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం OTT స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. మాలీవుడ్‌లో రూపొందిన రాణి: ది రియల్ స్టోరీ చిత్రం సెప్టెంబర్ 2023లో విడుదలైంది. ఈ చిత్రానికి కేరళలో మిక్స్డ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మార్చి 7న మనోరమ మ్యాక్స్‌లో ప్రసారం చేయనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం ఈ సినిమా కేవలం మలయాళ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులోకి రానుంది.