యాట సత్యనారాయణ దర్శకత్వంలో రానున్న తెలుగు చిత్రం "రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" సినిమా ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. 1947 ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ జరిగిన సంఘటనలను వెలుగులోకి తీసుకురావడమే ఈ చిత్రం లక్ష్యం.
తాజాగా ఈ సినిమాలో చెలువరాజ్ ఆర్య సేవక్ బసవ మాణయ్య క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ నటుడు యొక్క క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ, ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో మకరంద్ దేశ్పాండే, రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక మరియు అన్నుశ్రియ త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు.