‘ఫిదా’ సినిమాతో ఫేమస్ అయిన టాలీవుడ్ నటి శరణ్య తాజాగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’లో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో న్యూడ్‌గా నటించాల్సి వచ్చింది. దీనిపై కొందరు విమర్శలు చేయగా వాటిపై శరణ్య స్పందించింది. ‘‘ఈ చిత్రంలో న్యూడ్‌గా నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొందరు మాత్రం నేను ఇంకేదో ఆశించి ఇలా న్యూడ్‌గా నటించానని చర్చించుకోవడం, పలు సైట్లు దారుణంగా రాయడం బాధగా అనిపించింది’ అని పేర్కొంది.