2019లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో భారీ హిట్ సాధించాడు. తాజాగా మనోజ్ బీద దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రముఖ కమెడియన్ సంతానం ఏజెంట్ కన్నయిరం అనే టైటిల్ తో రీమేక్ చేయగా ఈ సినిమా నవంబర్ 25, 2022 న విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మార్చి 15, 2024 సాయంత్రం 10.00 గంటలకు జెమినీ మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో రియా సుమన్, శృతి హరిహరన్, పుగజ్, మునిష్కాంత్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాబ్రింత్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.