విజయ్, సమంత, కాజల్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో అట్లీ తెరకెక్కించిన చిత్రం మెర్సల్. దీపావళి శుభాకాంక్షలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టిస్తుంది. పలు వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టు ముట్టిన మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రేపు తెలుగులో అదిరింది అనే టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెంచింది. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా ఇందులో సత్య రాజ్ , ఎస్ జె సూర్య సపోర్టింగ్ రోల్స్ పోషించారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ బేనర్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుంది. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa