ప్రస్తుతం మహేశ్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మధ్య 'స్పైడర్' ప్రమోషన్స్ కోసం బ్రేక్ తీసుకున్న మహేశ్ బాబు. మళ్లీ 'భరత్ అను నేను' పై దృష్టి పెట్టాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అదే డేట్ ను దర్శక నిర్మాతలు ఫిక్స్ చేశారు. కైరా అద్వాని ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 'స్పైడర్' ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో, మహేశ్ తో పాటు ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. 'భరత్ అను నేను' భారీ విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. వాళ్ల అంచనాలను కొరటాల అందుకుంటాడేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa