అసోంలో భారీ ఉగ్రవాద మాడ్యూల్ బయటపడింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇమామ్ మహముదార్ కాఫిలా మాడ్యుల్ (ఐఎంకే) సంస్థకు చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అసోం పోలీసులు ఈ అరెస్టులు చేశారు. ఐఎంకే అనేది నిషేధిత జమాతే-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) అనుబంధ విభాగం. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిగిపోయిన తర్వాత జైళ్ల నుంచి విడుదలైన ఉగ్రవాదులు, సీనియర్ నాయకులు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఐఎంకేకు దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa