అల్ట్రామాస్ యాక్షన్ డ్రామా యానిమల్తో ప్రేక్షకులను అలరించిన తరువాత రణబీర్ కపూర్ తన తదుపరి సినిమాని దంగల్ ఫేమ్ నితేష్ తివారీతో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రానున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2న ముంబైలో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ అత్యంత ఎదురుచూసిన పురాణ చిత్రంలో సన్నీ డియోల్ కూడా కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.