దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్. గతేడాది తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాజాగా గుజరాత్ లో అమలాపాల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.