కేరళలో అధికార సీపీఐ (ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ దూరదర్శన్ వెనుకడుగు వేయలేదు. వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని శుక్రవారం 8 గంటలకు దూరదర్శన్ ప్రసారం చేసింది. దీనిపై యువజన కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సినిమా ప్రసారానికి వ్యతిరేకంగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తిరువనంతపురంలోని దూరదర్శన్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa