మొదట ఇండస్ట్రీ లోకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చి మెల్లిగా హీరోయిన్ గా మారింది ఆండ్రియా జర్మియా. ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడి మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ‘కందా నాల్ మదల్’ అనే సినిమాతో హీరోయిన్ గా అవతారం ఎతింది ఈ అమ్ముడు. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ ఐపోయింది. తాజాగా తిను వెంకటేష్ సైంధవ్ సినిమాలో విల్లన్ గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది.
ప్రస్తుతం తిను ఒక ఇంటర్వ్యూలో చేసి వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఇటీవల ఒక ఆన్లైన్ మీడియాకు ఆండ్రియా ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో తను పడ్డ కష్టాల గురించి ఇండస్ట్రీ లో ఉండే సమస్యల గురించి చెప్పుకొచ్చింది. తను ఒక పెళ్ళైన వ్యక్తితో సహా జీవనం చేసింది అని. అతడు ఒక స్టార్ హీరో అని చెపుతూ వాడు తనను మానసికంగా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాడు చూపుతు చాల ఎమోషనల్ అయ్యింది.ఒక స్టేజిలో ఎం చేయాలో తేలిక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అట ఆండ్రియా. ఆ సమయంలోనే నేను ఒక పుస్తకం రాసాను, కొన్ని ఆయుర్వేద మందులు వాడాను డిప్రెషన్ నుండి బయటకు రావటానికి. ప్రస్తుతం నేను కోలుకున్నాను, సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ ఆండ్రియా. ఇంతకీ ఆ హీరో ఎవరైయుంటారు అని నెటిజనులు తల పట్టుకుంటున్నారు.. ఎవరని మీరు అనుకుంటున్నారు ?