స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వరుసగా చీరకట్టులో మెరిసి మెస్మరైజ్ చేస్తోంది. అలాగే ఫిట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తన డైట్ గురించి చెప్పింది.కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. తన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేకుండా చేసుకుంది.టాలీవుడ్ స్టార్స్ సరసన నటించి మెప్పిస్తోంది. చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’లో నటించి ఆకట్టుకుంది.అంతకుముందుకు చిరుతో ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ సినిమాలు చేసి మెప్పించింది. సీనియర్ హీరోల సరసన కూడా నటించి అలరించడం విశేషం.ఇదిలా ఉంటే.. శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు క్రేజీగా నెట్టింట పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూ వస్తోంది.మరోవైపు బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు కూడా చేస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం వరుసగా చీరకట్టులో మెరుస్తూ తన అభిమానులు, నెటిజన్లను కట్టిపడేస్తోంది.అయితే సంప్రదాయ దుస్తుల్లో మెరియడమే కాకుండా.. ఫిట్ గా కనిపించి అట్రాక్ట్ చేస్తోంది. ఆ ఫొటోలను పంచుకోవడంతో పాటు తను ప్రస్తుతం డైట్ లో ఉన్నట్టు కూడా చెప్పింది. ఎవ్వరైనా సరే డైట్ లో ఉంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ మానేయాల్సి అని చెప్పుకొచ్చింది.