స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఉదయం లేవగానే ఏం చేస్తుందో తాజాగా వెల్లడించింది. ఆరోగ్యం కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వివరించింది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సామ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే సామ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏడాది పాటు సెలవు తీసుకొని హెల్త్ పై శ్రద్ధ వహించింది. మయోసైటిస్ నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.ఇదిలా ఉంటే.. సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించింది. అభిమానులకు తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. ఇక తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.తన మార్నింగ్ రోటీన్ ఎలా ఉంటుందనేది వివరించింది. ఉదయం ఎన్ని గంటలకు మేలుకుంటోంది.. లేచాక ఏం చేస్తుందనే ప్రతి విషయాన్ని ఓ పాడ్ కాస్ట్ తో పంచుకుంది.సామ్ మాట్లాడుతూ.. ‘నేను ఉదయం 5:30కి లేస్తాను. లేవగానే గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తాను. అంతా మంచి జరగాలని కోరుకుంటాను. ఆ వెంటనే ఒక ఐదు నిమిషాల పాటు సూర్య రష్మిని తీసుకుంటాను. నెక్ట్స్ బ్రీత్ ఎక్సర్ సైజ్ లు చేస్తారు. హాఫ్ మెథడ్ ఫాలో అవుతాను.ఇషా క్రియా మెడిటేషన్ ను 25 నిమిషాలు చేస్తాను. అలాగే కొద్ది నెలలుగా టాపింగ్ (తలపై చేతి వేళ్లతో తాకడం) చేస్తున్నాను. దీని వల్ల పెయిన్స్ నుంచి రిలీవ్ అవుతాం. గుడ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. వీటి ద్వారా జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయని తెలిపారు.