రాజమౌళి దర్శకుడిగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. కానీ ఆయనలో మరో టాలెంట్ ఉంది. డాన్సులతో ఇరగదీయడంలోనూ ఆయన ముందుంటున్నారు. భార్యతో చేసిన రచ్చ వైరల్‌గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు. భారతీయ సినిమా రూపు రేఖలు మార్చిన దర్శకుడు. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. నో డౌట్ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఆయన్ని మించిన డైరెక్టర్ లేరని చెప్పొచ్చు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టాడు. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. రాజమౌళి ఆ మధ్య ఓ ఈవెంట్లో డాన్స్ చేస్తూ కనిపించాడు. భార్య రమా రాజమౌళితో కలిసి స్టేజ్‌పై డాన్స్ చేయడం విశేషం. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు దాన్ని మించిన డాన్స్ పర్‌ఫెర్మ్ చేసి షాకిచ్చాడు. వాహ్ అనిపించాడు. తన భార్య రమా రాజమౌళితో కలిసి మరోసారి రెచ్చిపోయాడు రాజమౌళి.
తాజాగా డాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో కొంత మంది డాన్సర్లు, తమ సన్నిహితులతో కలిసి ఆయన డాన్స్ రిహార్సల్ చేయడం విశేషం. ఇందులో రాజమౌళి డాన్సులు చూస్తుంటే మతిపోవాల్సిందే. పర్ఫెక్ట్ డాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నాడు. `ప్రేమికుడు` చిత్రంలోని `అందమైన ప్రేమరాణి` పాటకి డాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో నెట్టింట రచ్చ లేపుతుంది. ఇది చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు స్పందిస్తూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి డాన్సుల ముందు చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లు ఎక్కడ నిలబడతారు. జక్కన్న ముందు వాళ్లంతా దిగదుడుపే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు తో చేసే సినిమాలో ఆయనకు డూప్ డాన్సర్ గా పనికొస్తాడని సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తంగా రాజమౌళి డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రాజమౌళి అపజయం లేని దర్శకుడు. ఆయన `స్టూడెంట్ నెం1`తో దర్శకుడిగా పరిచయమై ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. `సింహాద్రి`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` ఇలా ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ, హీరోల స్థాయిని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. ఆయన్ని ఇంటర్నేషనల్ స్టార్‌గా మార్చే పనిలో ఉన్నాడని చెప్పొచ్చు. దర్శకుడు రాజమౌళి చివరగా `ఆర్ఆర్ఆర్` చిత్రంతో వచ్చారు. ఈ మూవీకి ఏకంగా ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కానీ ఈ మూవీ కోసం మహేష్ వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా రెడీ అవుతున్నారు.