దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటించనున్నారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వెలువడనుంది.
తాజాగా ఇప్పుడు, రామాయణం నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రముఖ హాలీవుడ్ స్టూడియో వార్నర్ బ్రదర్స్‌తో రామాయణాన్ని నిజమైన అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా మార్చడానికి చర్చలు జరుపుతున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా, నమిత్ మల్హోత్రా యొక్క 7 సార్లు ఆస్కార్-విజేత VFX కంపెనీ DENG ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్‌లను రూపొందించడానికి సిద్ధంగా ఉంది.
మూవీ మేకర్స్ రామాయణాన్ని ట్రైలాజీగా ప్లాన్ చేసారు మరియు టీమ్ ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ ప్రారంభించింది. ఆస్కార్-విజేత సంగీత దర్శకులు AR రెహమాన్ మరియు హన్స్ జిమ్మర్ ఈ ప్రాజెక్ట్ చిత్రం కోసం ఆన్ బోర్డులోకి వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.