యామీ గౌతమ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆర్టికల్ 370 యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు మరియు ఆర్టికల్ 370 ప్రకారం మంజూరు చేయబడిన స్వయంప్రతిపత్తిపై ఆధారపడింది.
ఈ సినిమా ఏప్రిల్ 19న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఆదిత్య సుహాస్ జంభలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ప్రియమణి, అరుణ్ గోవిల్, రాజేంద్రనాథ్ జుట్షి, దివ్య సేథ్ మరియు ఐరావతి హర్షే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జ్యోతి దేశ్పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా ఆర్టికల్ 370ని రూపొందించారు.