టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి సినిమాని రవితేజతో ధమాకా చిత్రానికి పని చేసిన దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ SK30 గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ని రేపు ఉదయం 10 గంటల నుండి రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కొత్త ప్రాజెక్ట్ యొక్క కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లకు ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ పని చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాస్య మూవీస్ మరియు ఎకె ఎంటర్టైన్మెంట్స్ సందీప్ కిషన్ 30వ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.