సెలబ్రిటీలు తమ శరీరంపై వేసుకునే టాటూల వెనక అనేక కారణాలు, అర్థాలు దాగి ఉంటాయి. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన కాలుకు వేసుకున్న టాటూ వెనక అర్థాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కాలిపై ఉన్న టాటూ చెట్టు వేర్లని సూచిస్తుందని తెలిపారు. 'వేర్లు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం అంత ఎత్తుకి ఎదగగలం. మనం ఎంత స్థాయిలో ఉన్నా నేలను మరవొద్దు. ఇది నేను వ్యక్తిగతంగా నమ్ముతాను' అని చెప్పుకొచ్చారు.