రాజ్‌కుమార్ రావ్ మరియు శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన స్త్రీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి మరియు అభిషేక్ బెనర్జీ ఇతరలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
ఈ సినిమాలో వరుణ్ ధావన్ భేదియాగా కనిపించనున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆగస్టు 30, 2024న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ హర్రర్ చిత్రాన్ని దినేష్ విజన్ మరియు జియో స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.