విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫామిలీ స్టార్'. ఈ సినిమాని డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించాడు. గీత గోవిందం కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఫలితం మాత్రం వేరుగా వచ్చింది. ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు. మొత్తంగా కనీసం రూ.15 కోట్ల షేర్ కూడా రాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ తొలి రోజు నుండి ఈ సినిమా మంచి రెస్పాన్స్ రాబడుతుంది. ఏప్రిల్ 26 నుండి ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాగా ఫ్యామిలీ స్టార్ టాప్ లో ట్రెండ్ అవుతుంది. ప్రైమ్ టాప్ 10లో మొదటి స్థానం ఫ్యామిలీ స్టార్ దక్కించుకుంది. ఫ్యామిలీ స్టార్ కి ఓటీటీలో అనుకోని రీతిలో మంచి ఆదరణ పొందుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.