రాశి ఖన్నా తాజాగా తన గ్లామరస్ లుక్ పోస్ట్ చేసింది. మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఇస్తున్న ఫోజులు యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి.రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే అందమైన డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. రాశి ఖన్నా, తమన్నా కలసి బాక్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం మే 3న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రాశి ఖన్నా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. రాశి ఖన్నా తాజాగా తన గ్లామరస్ లుక్ పోస్ట్ చేసింది. మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఇస్తున్న ఫోజులు యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి.తన గ్లామర్ తో చేతబడి చేస్తున్నా అంటూ రాశి ఖన్నా ఈ ఫోటోలకు కామెంట్ పెట్టింది. రాశి ఖన్నా అప్పుడప్పుడూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కానీ సూపర్ హిట్స్ దక్కడం లేదు. చివరగా రాశి ఖన్నాకి తెలుగులో థాంక్యూ, పక్కా కమర్షియల్ లాంటి పరాజయాలు ఎదురయ్యాయి. రాశి ఖన్నా హోమ్లీగా, గ్లామర్ గా మెప్పించగల కొద్దిమంది నటీమణుల్లో ఒకరు. రెండు విధాలుగా కూడా ఆమె అనేక చిత్రాల్లో నటించింది. అలరిపిల్లగా, ఎమోషనల్ గా కూడా మెప్పించింది. రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. రాశి ఖన్నా ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఆమెకి ఒక్క తెలుగు చిత్రం కూడా చేతిలో లేదు.
#RaashiiKhanna pic.twitter.com/OYiacIIO5A
— VD bulletin (@vdbulletin) May 2, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa