వి యేశస్వి దర్శకత్వంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ నటించిన లవ్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సిద్ధార్థ్ రాయ్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 3, 2024న ఆహాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ఈ చిత్రంలో తన్వి నేగి కథానాయికగా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ చిత్రాన్ని నిర్మించారు.