మారుతీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భలే ఉన్నాడే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని మే 5, 2024న సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ మారుతీ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, యు అండ్ ఐ హలో వరల్డ్ వంటి అనేక విజయవంతమైన వెబ్ షోలను అందించిన నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాని రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.