గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇన్ఫ్లుఎంజా-ఎ అనే వైరస్‌తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో పాటలు పాడలేకపోతున్నానని.. ఇప్పటికే షెడ్యూల్ చేసిన తన మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌ను ఆగస్టుకు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు.