యాట సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం "రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలని అందుకుంది. 1947 ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ జరిగిన సంఘటనలను వెలుగులోకి తీసుకురావడమే ఈ చిత్రం లక్ష్యం.
ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 ఇండియా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మకరంద్ దేశ్పాండే, రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక మరియు అన్నుశ్రియ త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు.