కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఓ ప్రముఖ కంపెనీ ప్రకటనలో నటించేందుకు నటి సాయి పల్లవి రిజెక్ట్ చేయం ప్రస్తుతం హాట్ టాపక్ గా మారింది. సినీ ప్రముఖులు ఎవరైనా సరే నటించడం మాత్రమే కాకుండా .. రకరకాల మార్గాల్లో సంపాదిస్తున్నారు. అందులో వాణిజ్య ప్రకటనలు కూడా భాగమే. వాటి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్, శీతల పానీయాల నుంచి పొగాకు ఉత్పత్తులు.. ఆల్కాహాల్ ఉత్పత్తుల కు కూడా బ్రాండ్స్ గా ఉన్నారు స్టార్స్. సెలబ్రిటీలు రకరకాల ప్రకటనల్లో నటిస్తున్నారు. కోట్లకు పడగలెత్తితే అందులో నటించేందుకు చాలా మంది నటీనటులు సిద్ధంగా ఉన్నారు.
స్వచ్ఛమైన శాఖాహారులైన యాక్టర్స్ కొంత మంది.. మాంసాహారాన్ని కూడా ప్రమోట్ చేయడానికి వెనకాడటం లేదు. డబ్బులు మాత్రమే చూసుకుంటున్నారు కొందరు. అంతే కాదు బాలీవుడ్ నటులైతే.. ఏకంగా.. హానికరమైన పొగాకు ప్రకటనలలో పోటీ పడ్డారు. వాటిని చూసి వారి అభిమానులు కూడా కొని వాడుకుంటున్నారు. ఈ విషయంలో తీవ్ర విమర్షలు కూడా ఫేస్ చేస్తున్నారు స్టార్స్. కొంత మంది అలా ఉంటే.. మరికొంత మంది మాత్రం.. ఎన్ని కోట్లు ఇచ్చినా.. అటువంటి వాటిలోనటిచం అని చెప్పేస్తున్నారు. వారిలో నటి సాయి పల్లవి ఒకరు. 2019లో, తమ కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్‌లో నటించమని ప్రముఖ కాస్మెటిక్ క్రీమ్ తయారీ కంపెనీ అతన్ని సంప్రదించింది. ఆ యాడ్‌లో నటించేందుకు సాయి పల్లవికి 2 కోట్లు ఇస్తానని బేరం కూడా జరుగుతోంది. ఇదంతా వినని సాయి పల్లవి.. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇందులో నటించను అంటూ తిరస్కరించింది.నటి సాయి పల్లవి సినిమాల్లో మరియు నిజ జీవితంలో మేకప్ లేకుండా సహజంగా కనిపించడానికి ఇష్టపడుతుంది సాయి పల్లవి. అంతే కాకుండా ఆమె డాక్టర్ కావడంతో కాస్మెటిక్ ఉత్పత్తుల వల్ల చర్మానికి కలిగే నష్టాల గురించి బాగా తెలుసు. అందుకే ఓ కాస్మోటిక్ కంపెనీ ఓ అడ్వర్టైజ్‌మెంట్‌లో నటించమని ఆమెను సంప్రదించగా.. తిరస్కరించిందట సాయి పల్లవి. ఇక సినిమాల విషయంలో కూడా అంతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా ఆఫర్ వచ్చినా సరే.. కథ మొత్తం విని నచ్చితేనే నటిస్తుంది నేచురల్ బ్యూటీ. హీరో డామినేషన్ ఉన్న కథలు, హీరోయిన్ కు యాక్టింగ్ స్కోప్ లేకుండా.. గ్లామర్ వరకే పరిమితం అయిన సినిమాలు ఆమె చేయ్యనే చేయ్చదు. హీరోయిన్లు అంటే గ్లామర్ డాల్స్ మాత్రమే కాదు అని ఆమె అభిప్రాయం. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే ఏవి ఉన్నా.. వదిలిపెట్టదు సాయి పల్లవి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa