సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా 'ప్రాజెక్ట్ Z'. ఈ సినిమాని సివి కుమార్ దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరించారు. 2017లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ .. డేనియల్ బాలాజీ .. మైమ్ గోపి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఏడు ఏళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఆహా' సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa