అనన్య పాండే బాలీవుడ్లో పాపులర్ స్టార్ కిడ్. ఆమె బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అనన్య ఆదిత్య కపూర్‌తో విడిపోయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు, ఆదిత్య సారా అలీఖాన్‌తో కలిసి ఆదిత్య పార్టీ చేసుకుంటున్నట్లు ముంబై ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ముంబైలోని స్థానిక పబ్‌లో ఈ జంట పార్టీలు చేసుకుంటున్న ఫోటోలు వైరల్‌గా మారాయి.
ఆదిత్య, అనన్య ఇద్దరూ గత మూడేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ, ఈ జంట చాలా మందికి నచ్చింది. అయితే ఇప్పుడు వారు సారా అలీ ఖాన్ కారణంగా విడిపోయారని లేటెస్ట్ టాక్. ఆదిత్య మరియు సారాల ఈ కొత్త స్నేహం రాబోయే రోజుల్లో ఎక్కడికి వెళ్తుందో చూడాలి.