వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నాన్ USA రైట్స్ ని ది విలేజ్ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్టైన్మెంట్కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.