అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ మాతృమూర్తులను స్మరించుకుంటున్నారు. వారితో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ వారికి శుభాకంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవితో కలిసున్న ఫొటోను పోస్ట్ చేశారు. ‘జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకి ఈ ఒక రోజు ఏంటి.. ప్రతి రోజూ అమ్మదే.. ఈ జీవితమే అమ్మది. హ్యాపీ మదర్స్ డే’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.