రొమాంటిక్ మరియు యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GVM) తన చివరి చిత్రం జాషువా: ఇమై పోల్ కాఖా బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిలిచింది. మరోవైపు, అతని భారీ అంచనాల చిత్రం ధృవ నక్షత్రం: చాప్టర్ వన్ - యుద్ధ కాండమ్ విడుదల అనిశ్చితంగా ఉంది.
మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టితో రాబోయే ప్రాజెక్ట్ కోసం జివిఎం జతకట్టడంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మమ్ముట్టి, తన మమ్ముట్టి కంపానీ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించవచ్చు అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.