హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడ మీడియా పై ఫైర్ అయ్యారు. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఆవేదనచెందారు. ఓ సుదీర్ఘ సందేశం ఆమె పోస్ట్ చేశారు. మెహ్రీన్ సంచలన పోస్టి వైరల్ అవుతుంది. ఈ క్రమంలో మెహ్రీన్ మీద కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. మెహ్రీన్ గర్భం దాల్చారని, ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయ్యారంటూ మీడియాలో వార్తలు రావడమైంది. ఈ కథనాల మీద మెహ్రీన్ స్పందించారు. ఆమె మీడియా రాతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి గర్భం దాల్చాల్సిన అవసరం లేదు. మీ స్వార్థం కోసం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారు. జర్నలిస్టులకు బాధ్యత ఉండాలి.
పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లిదండ్రులు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ విధానం గురించి సరిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానకపోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.... అని మెహ్రీన్ హెచ్చరించారు. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఎగ్స్ ఫ్రీజింగ్ చేయడం ద్వారా భవిష్యత్ తో పిల్లల్ని కనవచ్చు. తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడ్డానని ఆ మధ్య రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చెప్పడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa