ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బడ్డీ' నుండి ఆ పిల్ల కనులే లిరికల్ సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 03:11 PM

సామ్ ఆంటోన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బడ్డీ' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క మొదటి సింగిల్ ఆ పిల్ల కనులే అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ చిత్రం తమిళ నటుడు ఆర్య యొక్క టెడ్డీకి అధికారిక రీమేక్. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా బడ్డీని నిర్మిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com