బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో అత్యంత బిజీ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమె చేతిలో నాలుగైదు షోస్ ఉన్నాయి. తనదైన ఎనర్జిటిక్ యాంకరింగ్‌తో షోస్‌ని రక్తికట్టిస్తుంది శ్రీముఖి. శ్రీముఖి ఎంతో స్ట్రగుల్ అయి యాంకర్‌గా నిలబడింది. ఆమె అందం, చలాకీతనం, ఎనర్జిటిక్ యాంకరింగ్ ఆమెకి ప్లస్ అయ్యాయి. అవి షోస్ రక్తికట్టడంలో ప్రధాన భూమిక పోషించాయి. ఈ క్రమంలో శ్రీముఖి షోస్ మోస్ట్ ఎంటర్టైనింగ్గా మారడం విశేషం. యాంకర్ శ్రీముఖి `అదుర్స్` షోతో కెరీర్‌ని ప్రారంభించింది. అంతకు ముందు నటిగా మెప్పించే ప్రయత్నం చేసింది. హీరోయిన్లకి ఫ్రెండ్‌గా మెరిసింది. సైడ్ క్యారెక్టర్స్ తో అలరించింది. సినిమాల్లో శ్రీముఖికి గుర్తింపు రాలేదు. ఆమె ఎంత ప్రయత్నం చేసినా అక్కడ గుర్తింపుకి నోచుకోలేకపోయింది. తెరపై కాసేపు కనిపించినా, వ్యక్తిగతంగా ఆమెకి ప్లస్ కాలేదు. సినిమా ఆఫర్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. అవి కూడా ఒకటి అర అన్నట్టుగానే మారాయి. ఈనేపథ్యంలో ఆమె టర్న్ తీసుకుంది. సినిమాలు వదిలేయకుండానే బుల్లితెరపై ఫోకస్ పెట్టింది.
యాంకరింగ్ కి సంబంధించి గట్టి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఆమె `అదుర్స్` షోతో యాంకర్‌గా కెరీర్ ని ప్రారంభించింది. షో మంచి ఆదరణ పొందింది. కానీ శ్రీముఖికి రావాల్సిన పేరు రాలేదు. కానీ ఆమెకి అదొక విజిటింగ్ కార్డ్ లా పనిచేసింది. `మంకీ మంకీ` షోతోనూ నవ్వులు పూయించింది. `సూపర్ మామ్` షో కూడా బాగానే అనిపించింది. ఈ క్రమంలో `పటాస్` షో ఆమెకి పెద్ద గుర్తింపుని తీసుకొచ్చింది. దీంతోపాటు `నీతోనే డాన్స్` షోకి కూడా యాంకర్‌గా చేస్తుంది. తాజాగా ఈ షోకోసం ఆమె కొత్త డ్రెస్‌లో ముస్తాబై ఆకట్టుకుంది. ప్లాటినమ్ కలర్ శారీలో మెరిసింది. తన అందాలకు ప్లాటినమ్ పూత పోసినట్టుగా ఉన్న చీర కట్టి మంత్రముగ్దుల్ని చేస్తుంది. కాస్త స్లిమ్ లుక్‌లో మెరుస్తూ మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
. #SreeMukhi pic.twitter.com/aEoTRkmtxW
— Actress Gallery (@Actress_Update) May 15, 2024