ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్.. కేన్స్ వేడుకలో మరోసారి మెరిసింది. ఆమె పర్మినెంట్ కేన్స్ మెంబర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. 2002 నుంచి ఆమె రెగ్యూలర్ గా ఈ కేన్స్ వేడుకలో సందడి చేస్తూనే ఉంది. తీరైన దుస్తులు ధరించిహోయలు పోతుంది. తాజాగా కేన్స్ 20024లోనూ ఐశ్వర్య రాయ్ సందడి చేసింది. పారిస్ వేదికగా జరిగేఈ వేడుకలో అవార్డులకంటే రెడ్ కార్పెట్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే ప్రపంచంలోని హీరోయిన్లంతా చాలా వరకు ఇందులో పాల్గొంటారు. మన ఇండియా నుంచి చాలా మంది భామలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రాయ్, కత్రినాకైఫ్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్, సోనమ్ కపూర్ వంటి భామలు సందడి చేశారు. మన సౌత్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే, తమన్నా వంటి వారు కూడా మెరవడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐష్ గురువారం నుంచి మెరుస్తుంది. ఆమె ఈ సారి రెండు సార్టు రెడ్ కార్పెట్‌పై హోయలు పోయింది. నెమలి పురివిప్పినట్టుగా ఉన్న వెరైటీ డిజైనింగ్ వేర్లో ఐశ్వర్యా రాయ్ కనువిందు చేసింది. పికాక్ నడిచి వస్తుందా అనేట్టుగా ఆమె రెడ్ కార్పెట్ పై వాక్ చేయడం విశేషం. ఆమె నడుచుకుంటూ వస్తుంటే కెమెరామెన్లు ఆమెని కెమెరాల్లో బంధించేందుకుపోటీ పడ్డారు. అదే సమయంలో కేన్స్ వేడుకలో ఈ సారి ప్రత్యేకంగా నిలిచింది ఐశ్వర్యా రాయ్. ఆమె తన కూతురుతో కలిసి ఇందులో పాల్గొంది. ఐష్ రెండు సార్లు మెరవడం ఓ విశేషమైతే, తన కూతురు సపోర్ట్ తో ఆమె వాక్ చేస్తూ కనిపించడం మరో విశేషం. కూతురు ఆద్య కూడా హీరోయిన్లా కనిపిస్తుండటం విశేషం. ఇక ఐశ్వర్యా రాయ్ చేతికి గాయమైంది. కుడి చేతికి కట్టుతో కనిపించింది. గాయంలోనూ చేయి కదపని స్థితిలోనూ ఆమె బ్యాండేజ్ వేసుకుని కేన్స్ లో ఇంతటి భారీ డిజైనింగ్ డ్రెస్‌ని ధరించి వాక్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. విశ్వసుందరి డెడికేషన్‌కి అంతా వాహ్ అనాల్సిందే. మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్య రాయ్.. దాదాపు 22 ఏళ్లుగా కేన్స్ లో మెరుస్తూ భారతీయతని చాటి చెబుతుంది. ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఈ సారి కాస్త బొద్దుగా కనిపించింది. గాయం కారణంగా ఆమె వెయిట్ పెరిగినట్టు తెలుస్తుంది