నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ ప్రధాన విలన్గా నటించాడు. తాజాగా ఇప్పుడు నటుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం, అర్జున్ రాంపాల్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో రూపొందుతున్న అతిపెద్ద చిత్రాలలో ఒకటైన హౌస్ఫుల్ 5కి సంతకం చేశారు.
సాజిద్ నడియాడ్వాలా ఈ చిత్రానికి నిర్మాత మరియు ప్రధాన విలన్ పాత్ర కోసం అర్జున్ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో హౌస్ఫుల్ 5 లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ మరియు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కామెడీ చిత్రం ఆగస్టు 2024 నెలలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.