పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తాజాగా జంతువులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. అయితే దీనికి 'మీది కూడా పవన కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. దీంతో ఆ నెటిజన్ పై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. 'నా పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో ఎందుకు కంపేర్ చేస్తారు? పదేళ్ల వయసు నుంచి నాకు జంతువులంటే ప్రేమ. నా ఎక్స్ హస్బెండ్ నాలాగా యానిమల్ లవర్ కాదు' అంటూ జవాబిచ్చారు. పవన్ ఫ్యాన్స్ ప్రతిసారీ కామెంట్స్ పెట్టడం చిరాకు తెప్పిస్తోందని మండిపడ్డారు.