ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది.